![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -636 లో..... కేక్ కటింగ్ దగ్గరికి అందరు వస్తారు. ప్రతీ ఇంట్లో దీప లాంటి అమ్మాయి ఉంటే.. ఆ ఇల్లు బాగుంటుందని పారిజాతం అంటుంది. సుమిత్ర కేక్ కట్ చేస్తుంది. కేక్ లో జ్యోత్స్న విషం కలుపుతుంది. ఎక్కడ తనకి తినిపిస్తుందోనని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ముందు దీపకి తినిపించమని దశరథ్ అంటాడు. సుమిత్రని కాపాడింది ఒకరకంగా దీప కూడా కారణం.. ఇద్దరు నా కూతుళ్ళే దీప నా పెద్ద కూతురు అని దశరథ్ అనగానే నేను డాడీ మాటకి సరే అంటున్నా దీపకే తినిపించు మమ్మీ అని జ్యోత్స్న అంటుంది.
దాంతో కార్తీక్ కంగారుపడతాడు దీపకి సుమిత్ర కేక్ తినిపిస్తుంది. కార్తీక్ కూడా తింటాడు. అదేంటీ ఇంకా దీప చావలేదని జ్యోత్స్న అనుకుటుంది. జ్యోత్స్న దగ్గరికి కార్తీక్ వెళ్లి షాక్ అయ్యావా మరదలా.. నువ్వు విషం కల్పడం నేను చూసాను.. నేను ఎందుకు టెన్షన్ పడ్డాననుకుంటున్నావా నాకు తెలిసిపోయిందని నీకు తెలిస్తే ప్లాన్ చేంజ్ చేస్తావ్ కదా అందుకే యాక్టింగ్ చేసానని కార్తీక్ అనగానే జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. ఆ తర్వాత జ్యోత్స్న, కార్తీక్ ఇద్దరు పక్కకి వెళ్తారు. ఇక జ్యోత్స్న ఓపెన్ గానే కార్తీక్ తో మాట్లాడుతుంది. ఏంటి మరదలా డిఎన్ఏ టెస్ట్ చేయించినట్లున్నావ్.. నిజం తెలిసి పోయిందా అని కార్తీక్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. నేను ఎక్కడ ఏది దాచిన కూడా వట్టిగనే తెలిసిపోతుంది బావ అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే దాస్ వస్తాడు. నా గురించి బావకి నువ్వే చెప్పావ్ కదా నాన్న అని దాస్ ని జ్యోత్స్న అడుగుతుంది. మావయ్యకి నీ గురించి నిజం తెలియలేదు తెలిస్తే ఇలా ఎందుకు ఉంటాడని కార్తీక్ అంటాడు.
ఇంకా నన్ను మభ్యపెట్టాలని చూడకు బావ అని జ్యోత్స్న అంటుంది. అల్లుడు చెప్పేది నిజమే అని దాస్ అనగానే నువ్వు మాట్లాడకు నాన్న నా మీద ఒట్టేసినా కూడా అందరికి నిజం చెప్పావని దాస్ పై జ్యోత్స్న ఫైర్ అవుతుంది. నువ్వు నన్ను చంపాలని ట్రై చేసావని దాస్ అంటాడు. అప్పుడు నువ్వు నిజం చెప్పకుండా ఆపాలని అలా చేశాను కానీ చాలా సార్లు గిల్టీగా ఫిల్ అయ్యానని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |